TDP Elections Manifesto: మహిళలకు నెలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ.2500, ఎన్నికల మేనిఫెస్టోలో వరాలు కురిపించిన చంద్రబాబు, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాల ప్రకటన

రాజమండ్రిలో రెండు రోజుల పాటూ నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో (Tdp Ap Elections Manifesto) ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు

TDP Elections Manifesto (PIC @ Twitter)

Rajamahendravaram, May 28: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే సీఎం వైయస్ జగన్ తన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక టీడీపీ కూడా ఎన్నికల బరిలో ముందంజలో నిలిచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో రెండు రోజుల పాటూ నిర్వహించిన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట ఏపీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో (Tdp Ap Elections Manifesto) ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). మహిళల కోసం మహాశక్తి, యువత కోసం యువగళం, రైతుల కోసం అన్నదాత పేరిట పలు పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అలాగే, ఇంటింటికీ నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ పేరిట మరో మూడు కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు.

భవిష్యత్తుకు గ్యారెంటీలోని అంశాలు..

మహిళల కోసం మహాశక్తి

ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో..

18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి యువతి, మహిళకు ఆడబిడ్డ నిధి

జిల్లా పరిధిలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సులో ప్రయాణం

తల్లి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు

ఎంత మంది పిల్లలు ఉన్నా ఓకే.. స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు

కుటుంబంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా ఆర్థిక సహాయం

ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం

ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

20 లక్షల మందికి ఉద్యోగాలు

ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి

మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు

1) రిచ్ టు పూర్

1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2) బీసీలకు రక్షణ చట్టం

బీసీలకు రక్షణ చట్టం తెచ్చి… వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.

3) ఇంటింటికీ నీరు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం.

4) అన్నదాత

ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

5) మహాశక్తి

1.ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ‘తల్లికి వందనం’ పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

3.”దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

4.”ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.

6) యువగళం

1. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

2. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 2500 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం