AP CM YS Jagan Bus Yatra: ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర...కనిగిరిలో సీఎం జగన్ రోడ్ షో...వేలాదిగా తరలి వచ్చిన ప్రజలు
కె.అగ్రహారం నుంచి పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల చేరుకున్న అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 10వ రోజు జువ్విగుంటక్రాస్ నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైంది. జువ్విగుంట క్రాస్ నుంచి పొన్నలూరు మండలం కె.అగ్రహారం చేరుకున్న సీఎం వైయస్ జగన్‌కు ప్రజలు భారీ క్రేన్స్‌తో 10 గజమాలలతో స్వాగతం పలికారు. కె.అగ్రహారం నుంచి పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల చేరుకున్న అనంతరం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు.