Gold Smuggling: అండర్‌వేర్‌లో 1 కేజీ బంగారం, చూసి షాకవుతున్న కస్టమ్స్ అధికారులు, శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన బంగారం..

కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా నిత్యం జరుగుతూనే ఉంది.

Smuggle Gold (Photo Credits: IANS)

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ బంగారం బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా నిత్యం జరుగుతూనే ఉంది. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తూ పట్టుకుంటున్నా స్మగ్లర్లు కొత్త విధానంలో బంగారాన్ని చేరవేస్తున్నారు.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి 1,144 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన లోదుస్తుల్లో పెట్టుకుని రాగా, కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. దీని విలువ 62 లక్షలుగా కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.