Denduluru YSRCP Siddham Meeting: జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. దేవుడు, ప్రజలే నా తోడు, బలం.. ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర.. నాది అర్జునుడి పాత్ర-సీఎం వైఎస్‌ జగన్‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ ద్వారా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా..? వైసీపీని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..? అని-సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

cm jagan

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈరోజు ఏలూరు జిల్లా దెందులూరులో ఎన్నికల సన్నాహక సభ సిద్ధంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ ద్వారా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా..? వైసీపీని మరోసారి గెలిపించడానికి సిద్ధమా..? అని-సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. సీఎం జగన్ మరిన్ని విషయాలు పేర్కొంటూ... రామాయణం, మహాభారతం ఈరెండింటిలోనూ విలన్లు అంతా కూడా  చంద్రబాబు రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓదత్తపుత్రుడు రూపేనా ఇతర పార్టీల్లో ఉన్నా చంద్రబాబు గారి కోవర్టులు ఇంత మంది తోడేళ్లు అందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే.... వారి వైపు నుంచి చూస్తే ఈ సీన్ జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. అని పేర్కొన్నారు.

అలాగే మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా..? ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా..? పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా..? అని సీఎం జగన్ వైసీపీ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా:

పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా..

రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు

- సీఎం జగన్#Siddham pic.twitter.com/hwPmTOFIw5

ఇదిలా ఉంటే ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్‌లో సిద్దం కార్యక్రమం జరగుతోంది. అందరి దృష్టి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగంపైనే ఉంది. భీమిలిలో జరిగిన మొదటి సిద్దం కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఘనవిజయం సాధించడంతో, ఈరోజు దెందులూరులో సీఎం జగన్  ప్రసంగంపై అందరి దృష్టి నెలకొని ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif