Pawan Kalyan On Vana Mahotsavam: వన మహోత్సవం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపు, అన్య జాతుల మొక్కలను పెంచడం ఆపేద్దామన్న పవన్

ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవన్. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Dy CM Pawan Kalyan says Citizens to Participate in Vana Mahotsavam for a Green Andhra Pradesh

VIj, Aug 30:  దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవన్. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఇవాళ్టి నుండి ప్రారంభం అయ్యే ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలన్నారు. పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోండి. మొక్కల పెంపకం అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలన్నారు.

కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదాం. కానుగ, వేప, రావి, చింత, ఉసిరి, శ్రీగంధం, మర్రి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతులు మొక్కలను పెంచుదాం అన్నారు.

పదిమందికి నీడనిస్తూ, వాటి ఉత్పత్తులను పంచే మొక్కలను నాటుకుందాం. 29శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతం చేర్చేలా శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదాము. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలి అని కోరారు.   పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని  

Here's Pawan Kalyan Video:

అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారు. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయన్నారు. దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్ ను నిషేధించాయని... కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయన్నారు పవన్. భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కోనోకార్పస్ మొక్కను పశువులు తినవు. పక్షులు గూడుపెట్టుకోవు. చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను మనం పెంచుకోవడం సరికాదు అన్నారు.