FIR On Pawan Kalyan Fans: చిత్తూరులో పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదు, సినిమా రిలీజ్ సందర్భంగా మేకను బలి ఇచ్చారనే కేసులో FIR నమోదు..
తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా అభిమానులు మేకను బలి ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ విషయంపై చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది.
Chittoor, Mar 7: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఫిబ్రవరి 25న సినిమా విడుదల అవ్వగా.. తమ అభిమాన హీరో సినిమా విడుదల సందర్భంగా అభిమానులు మేకను బలి ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ విషయంపై చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది.
దాంతో పవన్ కల్యాణ్ అభిమానులపై ఏపీ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం - 1950లోని సెక్షన్ 6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1) (ఎ), పీసీఏ 11(1)(ఎ) కూడా నిందితులపై మోపారు. ఇందుకు సంబంధించిన వివరాలను అషర్ అనే న్యాయవాది సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. కొందరు వ్యక్తులు మేకను బలి ఇస్తున్న ఫొటోను షేర్ చేశారు.
Tags
Pawan Kalyan
pawan kalyan craze
pawan kalyan fan
Pawan Kalyan fans
pawan kalyan fans fires on posani
pawan kalyan fires
pawan kalyan latest news
pawan kalyan latest speech
Pawan Kalyan Speech
pawan kalyan vs posani
pawan kalyan vs sri reddy
posani about pawan kalyan
posani comments on pawan kalyan
Power Star Pawan Kalyan