AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.

Andhra Pradesh Heavy rains for another 3 days

Vijayawada, Dec 22: ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh) వాసులు ఊపిరిపీల్చుకునే విషయాన్ని వాతావరణశాఖ తెలిపింది. ఏపీకి వాయుగుండం ముప్పు తప్పినట్టు వెల్లడించింది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో రేపటి వరకు తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది. అలాగే, వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం ఇంకా అలజడిగానే ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది.

అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

ఇక్కడ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శనివారం కూడా భారీ వర్షాలు కురిశాయి.

అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్  



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif