Hyderabad, DEC 21: సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్ (Allu arjun) స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ఇది పూర్తిగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అన్నారు. అంతా మంచి జరగాలని అనుకున్నానని.. అనుకోని ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎవరి తప్పు లేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు. హాస్పటల్‌లో ఉన్న బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని.. ఆ ఫ్యామిలీకి జరిగిన దానికి తాను చాలా బాధపడుతున్నానన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నానన్నారు.
శ్రీ తేజ్ (Sritej) ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తాను ఎవరినీ దూషించదలచుకోలేదని చెప్పారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా..? నేను ఎవరినైనా ఏమైనా అంటానా? అని ప్రశ్నించారు. ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిషన్ కమ్యూనికేషన్ జరుగుతోందన్నారు. ఈ ఘటన విషయంలో నా క్యారెక్టర్‌ను కించపరిచారని వాపోయారు. థియేటర్ తనకు దేవాలయం లాంటిదని.. అక్కడ ప్రమాదం జరగడం బాధగానే ఉందన్నారు. తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఎలాంటి రోడ్‌షో (Allu Arjun Roadshow), ఎలాంటి ఊరేగింపు చేయలేదన్నారు. తాను తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు సినిమా చేస్తే.. తన క్యారెకట్లర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు.
Allu Arjun Makes Clarification On Sandhya Theater Row
Allu Arjun about sandhya theatre incident 👏 #RevanthReddy pic.twitter.com/gXiWQwQ124
— Anvesh NTR (@anvesh_vem31863) December 21, 2024
థియేటర్ వద్ద రేవతి (Revathi Dead) మృతి విషయం.. బాబు ఆరోగ్య పరిస్థితి మరుసటి రోజు తెలిస్తే వెంటనే బన్నీ వాసును పంపించానన్నారు. తాను కూడా వస్తానని చెప్పానని.. కానీ అప్పటికే నా మీద అప్పటికే వాళ్లు కేసు ఫైల్ చేశారని చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ వెళ్తామని ముందుకు వచ్చినా లీగల్ టీమ్ వద్దని చెప్పిందన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానులను పరామర్శించేందుకు చాలా దూరమే వెళ్లాలని.. తన అభిమానులు చనిపోతే వెళ్లకుండా ఉంటానా? అని ప్రశ్నించారు. ఘటన జరిగిన విషయం తెలిసి ఇంకా షాక్‌లోనే ఉన్నానని.. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టానన్నారు. డబ్బులు అనేది ఇక్కడ విషయమే కాదన్నారు. సినిమాకు సంబంధించి చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నామని.. ఈ ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశామన్నారు.