CM Khattar Visits Sarada Peetham: శారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన

విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు.

CM Khattar Visits Sarada Peetham (Photo-Twitter)

విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఖట్టర్‌ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు సీఎంకు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. కాగా, ఆదివారం సాయంత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఖట్టర్‌ సందర్శించారు.

ఒంటిమిట్ట కల్యాణోత్సవం, సంప్రదాయ పంచెకట్టులో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటల 25 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 11గంటల 05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి 11గంటల 50 నిమిషాలకు రుషికొండ పెమ వెల్‌నెస్‌ రిసార్ట్‌కు వెళ్తారు. అక్కడ హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అవుతారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement