Andhra Pradesh: ఒంటిమిట్ట కల్యాణోత్సవం, సంప్రదాయ పంచెకట్టులో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నేడు శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయపబద్ధంగా స్వాగతం పలికారు.

Andhra Pradesh: ఒంటిమిట్ట కల్యాణోత్సవం, సంప్రదాయ పంచెకట్టులో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌
CM YS Jagan offers prayers at Lord Srirama Temple in Vontimitta

ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో నేడు శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు సీఎం జగన్ కొద్దిసేపటి కిందట ఒంటిమిట్ట చేరుకున్నారు. ఆయనకు కోదండరామస్వామి ఆలయంలో మంత్రి రోజా, అర్చకులు, అధికారులు సంప్రదాయపబద్ధంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీరాముడికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కోదండరాముని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సంప్రదాయ పంచెకట్టులో ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారిని దర్శించుకున్న సీఎం జగన్, కల్యాణ వేదిక వద్దకు తరలివెళ్లనున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 15, 2022 08:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).