Kotamreddy Sridhar Reddy: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న ఆడియో! మీరూ వినండి..

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Credits: Wikimedia Commons

Vijayawada, Feb 4: వైసీపీ (YCP) రెబల్ ఎమ్మెల్యే (Rebel MLA) కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని (Kotamreddy Sridhar Reddy) కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ (Phone) చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ (Viral) అవుతోంది. ఆ ఆడియో ప్రకారం.. ‘జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తా. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కెళ్తా అని కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ హెచ్చరించాడు.

నేను, దేవుడు వద్దనుకున్నాం.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్ (వీడియోతో )

తనకు తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకున్న అనిల్.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు కూడా నీ కంటే ఎక్కవగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొడతారు. డేట్ ఫిక్స్ చేసుకో. నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ముఖ్యమంత్రిని తాను ఏమీ అనలేదని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా అనిల్ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం చెబుతూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. వీడియోతో

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now