KA Paul: నేను, దేవుడు వద్దనుకున్నాం.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్ (వీడియోతో )
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని... అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు.
Hyderabad, Feb 4: తెలంగాణ (Telangana) నూతన సచివాలయంలో (New Secretariat) అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని... అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు.
ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని... తనను తెలంగాణ నుంచి బహిష్కరిద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. వీడియోతో
(The above story first appeared on LatestLY on Feb 04, 2023 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

