Weather Forecast in AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు, మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని తెలిపిన వాతావరణ శాఖ
ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.
ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. వివిధ ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైనే ఉండటంతో పలుచోట్ల వడగాడ్పులు, కొన్నిచోట్ల తీవ్ర వడగాడ్పులు కూడా వీచాయి. నిప్పులు చెరిగే ఎండలకు జనం అల్లాడిపోయారు. అయితే పరిస్థితిలో మార్పు వచ్చింది.వడగాడ్పులు తగ్గుముఖం పట్టాయి.
అల్పపీడన ద్రోణి, విండ్ డిస్కంటిన్యూటీ (గాలికోత)ల కారణంగా అకాల వర్షాలు మొదలయ్యాయి. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ఆకాశంలో మబ్బులు కమ్మి ఒకింత చల్లదనాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల సాధారణంగాను, కొన్నిచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువగాను నమోదవుతున్నాయి.
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక, మరో మూడు రోజుల పాటు గాలివానలు, ఎవరూ బయటకు రావొద్దని ఐఎండీ ఆదేశాలు
ఈ పరిణామాలతో పగటి ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం వరకు ఒకింత ప్రభావం చూపుతున్నా ఆ తర్వాత తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం పలుచోట్ల సాధారణంగాను, కొన్నిచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగాను, అక్కడక్కడ 1–2 డిగ్రీలు ఎక్కువగాను నమోదవుతున్నాయి. ఫలితంగా నాలుగైదు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఎండలు విజృంభించడం లేదు.
ప్రస్తుతం అల్పపీడన ద్రోణి/గాలులకోత పశ్చిమ విదర్భపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు మునుపటికంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులు వారం రోజులపాటు కొనసాగుతాయని, అందువల్ల అప్పటివరకు వడగాడ్పులు వీచే అవకాశాల్లేవని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)