Hyd, April 25: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి.హుస్సేన్‌సాగర్‌లోని భాగమతి బోటు కొట్టుకుపోయింది.
అందులో ఉన్న 40 మంది ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, బషీరాబాద్, ఓయూ, నాచారం, కొండాపూర్, మణికొండ సహా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షం నీరుతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కూకట్‌పల్లి, మూసాపేట, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూలో వర్షం కురిసింది. చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, అల్వాల్, నేరేడ్‌మెట్, మల్కాజ్‌గిరి, మల్కాజ్‌గిరి, అమీర్‌పేట, పంజాగుట్ట, ఈసీఐఎల్, ఏఎస్‌రావు నగర్, కాప్రాతో పాటు పలు ప్రాంతాల్లో గాలివాన కురిసింది.
రాగల మూడు రోజుల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, ములుగు, ఖమ్మం, సిద్ధిపేటతో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసిందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.