Police Commemoration Day 2020: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్, బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంపు, పది రోజుల పాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినాలుగా (Police Commemoration Day 2020) జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ‌ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ ఏపీ పోలీస్ శాఖ (Andhra Pradesh Police Department) నిర్ణయం తీసుకుంది.

Andhra pradesh dgp-gautam-sawang-calls-people-support-janata-curfew (Photo-Facebook)

Amaravati, Oct 20: ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంను (Police Commemoration Day 2020) జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ‌ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ ఏపీ పోలీస్ శాఖ (Andhra Pradesh Police Department) నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్‌బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ (DGP Gautham Sawang) సంతకం చేయించారు. ప్రతి పోలీసు స్టేషనుకు వెళ్లి రేపటి నుంచి ఈ పాలసీలు అందించనున్నారు. ఈరోజు లాంఛనంగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్‌లకు పాలసీలు అందించారు.

ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ మాట్లాడుతూ, పోలీసుల అద్భుత సేవలను కొనియాడుతూ వారికి సెల్యూట్‌ చేశారు. వారికి 40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ , 3లక్షల వరకు సహజమరణం పాలసీ అందించనున్నట్లు తెలిపారు. సంవత్సరానికి 12 రూపాయలు కడితే రెండు లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజనను కూడా అందరూ వినియోగించుకోవాలి అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీలో అమలు జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు డీజీపీ చెప్పారు.

 సీఎం జగన్ క్రిస్టియన్ అయితే నిరూపించండి, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, ఏపీ సీఎం మతం ఏంటో చెప్పాలని పిటిషన్

ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ చేధించిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్‌ తో మ్యాపింగ్ చేశామని, అంతర్వేది రధం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయని ప్రకటించారు.

దిశ యాప్ ఎలా వాడాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుందా, పూర్తి వివరాలు మీ కోసం

అందులో 27 కేసులు చేధించి తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54 మంది పాత నేరస్ధులను గుర్తించామని పేర్కొన్నారు. 130 మందిని అరెస్టుచేసి , 1196 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. దిశా అప్లికేషన్‌ను 11 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ఎస్ఓఎస్ యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయని, వీటిలో 604 కాల్స్ పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 122 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లు 2019లో 62 నమోదు కాగా, 2020 ఇప్పటి వరకూ 279 నమోదు అయినట్లు వెల్లడించారు. రాష్ట్రం లో నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని గౌతం సవాంగ్‌ ప్రకటించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Martyr's Day 2025, Mahatma Gandhi Death Anniversary Quotes: నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

Martyrs' Day 2025, Mahatma Gandhi Punyatithi, Shaheed Diwas Quotes: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మహాత్మ గాంధీ కొటేషన్స్ షేర్ చేసి నివాళి అర్పించండి..

Peddireddy Ramachandra Reddy: 25ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాం, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Uttar Pradesh: వీడియో ఇదిగో, గుండెపోటుతో ఆస్పత్రికి మహిళ వస్తే వైద్యం చేయకుండా రీల్స్‌ చూస్తూ కూర్చున్న డాక్టర్, కళ్లముందే విలవిలలాడుతూ బాధితురాలు మృతి

Share Now