AP CM Religion Row: సీఎం జగన్ క్రిస్టియన్ అయితే నిరూపించండి, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, ఏపీ సీఎం మతం ఏంటో చెప్పాలని పిటిషన్
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Oct 20: ఏపీ సీఎం మతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం వైయస్ జగన్ మతం (Andhra Pradsh Cm religion Row) ఏంటో ఆయనే బహిర్గత పరచాలని, ఇందుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని గుంటూరుకు చెందిన ఆలోకం సుధాకర్‌బాబును హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై ఏపీ అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన ఆధారాలు, సమాచారం లేకుండా కోర్టులను ఆశ్రయించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు (AP High Court) వ్యాఖ్యానించింది.

సీఎం జగన్‌ హిందువు కాదని, క్రైస్తవుడని ఏ ఆధారంతో చెబుతారని? ప్రశ్నించింది. అలాంటి ఆధారాలుంటే తమ ముందుంచాలని పిటిషనర్‌ను (High Court tells petitioner) ఆదేశించింది. ఆధారాల్లేకుండా సీఎం మతం (AP CM Religion Row) గురించి మాట్లాడ్డం సరికాదని పేర్కొంది. తగిన ఆధారాలుంటేనే తదుపరి విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తాము ఆధారాలు అడిగిన తరువాత సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటామని పిటిషనర్లు (petitioner) పేర్కొనడం ఎంత మాత్రం సరికాదని స్పష్టం చేసింది.

ఇసుక రవాణాలో ఎక్కడా అవినీతి ఉండకూడదు, అందుబాటు ధరలో పూర్తి పారదర్శక విధానం ఉండాలి, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్

తన మతం ఏమిటో బహిర్గతం చేసేలా ముఖ్యమంత్రినే ఆదేశించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మీరు పిటిషన్ దాఖలు చేస్తే, ముఖ్యమంత్రి ఎందుకు ఆధారాలు చూపాలని ప్రశ్నించింది.ఈ వాజ్యంలో గవర్నర్‌ను ప్రతివాదుల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రకటిస్తూ ఈ కేసు విచారణను ఈ నెల 22వతేదీకి వాయిదా వేశారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్ట విరుద్ధమంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కో వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. డిక్లరేషన్ పై టీవీ చానళ్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీ కృష్ణయ్య ప్రస్తావించగా ‘టీవీ చానళ్ల గురించి అసలు చెప్పొద్దు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

భారీ వర్షాలతో రూ.4,450 కోట్ల మేర నష్టం, వెంటనే ఆదుకోవాలని హోం మంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం లేఖ, తక్షణమే ముందస్తుగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని వైయస్ జగన్ వినతి

అదేవిధంగా పిటిషన్‌లో ప్రతివాదిగా గవర్నర్‌ పేరును ప్రస్తావించడాన్ని ఆక్షేపిస్తూ.. దానిని సుమోటోగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గవర్నర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నప్పటికీ ఆ పిటిషన్‌కు ఎలా నంబరు కేటాయించారంటూ రిజిస్ట్రీని(జుడీషియల్‌)ని పిలిపించి అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

చట్టాన్ని ఉల్లంఘించిన సీఎం జగన్‌, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై సోమవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా... పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని, కానీ జగన్‌ దీనిని పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించడం సరికాదన్నారు. ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెలంపల్లి, కొడాలి వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు.

నిబంధనలు అమలు చేయడంలో టీటీడీ చైర్మన్‌, ఈవో విఫలమైనందున వారిని ఆ పదవుల నుంచి నిలువరించాలని కోరారు. జగన్‌ ఏ మతస్థుడన్నదానిపై ప్రజల్లోనూ సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర పాలకుడి గా జగన్‌కు ఉందని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.