N-Chandrababu-Naidu

Vjy, Oct 31: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ (CID) తాజాగా ఏపీ హైకోర్టులో (AP High Court) పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది. చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఆంక్షలు విధించాలన్నారు.

మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేయకూడదని కూడా పిటీషన్‌‌లో సీఐడీ పేర్కొంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరింది. మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాల రీత్య ఇచ్చారని పేర్కొంటూ పిటీషన్ దాఖలు చేసింది. కేవలం చికిత్సకు మాత్రమే ఆయన పరిమితం కావాలని ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో సీఐడీ పిటీషన్ వేసింది.

వీడియో ఇదిగో, 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

ఇక మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది. ఈకేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు, నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు తీర్పు

అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు (Chandrababu) బెయిల్‌ ఇచ్చినందున బెయిల్‌ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని తెలిపారు. ఈ మేరకు హైకోర్టుకు ఏజీ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 21కి వాయిదా వేసింది.

మధ్యంతర బెయిల్‌లో మరో 5 నిబంధనలు చేర్చాలని సీఐడీ పిటిషన్

1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు,

2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు

3. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి

4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు

5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి

ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్