Sankranthi 2024: పందెం కోడి ధర రూ.3 లక్షలు, గుడ్డు ధర 3 వేలు, ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఆ పందెం కోడి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

మా అంటే వెయ్యి రూపాయలు. అంతకు మించి అంటే పందెం కోళ్లకు వేలల్లో డిమాండ్ ఉంటుంది. కానీ.. ఏకంగా 3 లక్షల రూపాయల కోడి పుంజు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. 3 లక్షల రూపాయల కోడి పుంజు ప్రత్యేకత ఏంటి? దాని ఒక్క కోడి గుడ్డు ధర 3 వేల రూపాయలు అట. షాకింగ్ గా ఉంది కదా

The Peruvian / Twitter

మామూలుగా ఒక పందెం కోడి ధర ఎంతుంటుంది. మా అంటే వెయ్యి రూపాయలు. అంతకు మించి అంటే పందెం కోళ్లకు వేలల్లో డిమాండ్ ఉంటుంది. కానీ.. ఏకంగా 3 లక్షల రూపాయల కోడి పుంజు అంటే మాత్రం ఆలోచించాల్సిందే. 3 లక్షల రూపాయల పందెం కోడి ప్రత్యేకత ఏంటి? దాని ఒక్క కోడి గుడ్డు ధర 3 వేల రూపాయలు అట. షాకింగ్ గా ఉంది కదా. ఇంతకీ అక్కడ ఉండే కోళ్ల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ప్రదీప్ ఫామ్ పేరుతో పౌల్ట్రీ ఫామ్ ను ఏర్పాటు చేసిన ప్రదీప్ అనే యువకుడు ప్రస్తుతం నాటు కోళ్లను పెంచి లక్షలు గడిస్తున్నాడు. యువకుడిది ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న నున్న అనే గ్రామం. బాగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ కు తర్వాత కోళ్ల బిజినెస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది. లక్షల జీతాన్ని కాదనుకొని.. కోళ్ల బిజినెస్ వైపు ఎలా పరుగులు తీశాడు.

ప్రదీప్.. ఎంబీఏ చేసి ఉన్నత ఉద్యోగంలో చేరాడు. లక్షల్లో జీతం. కానీ.. ఏదో అసంతృప్తి. కొన్నేళ్ల వరకు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత వీకెండ్ లో నాటు కోళ్ల వ్యాపారం ప్రారంభించాడు. ముందు పార్ట్ టైమ్ గానే ప్రారంభించాడు. కానీ.. నాటు కోళ్ల ద్వారా మంచి ఆదాయం వస్తుండటంతో.. ఉద్యోగాన్ని వదిలేసి.. తన సొంతూరుకు వచ్చి పూర్తిగా నాటు కోళ్ల వ్యాపారం మీదనే దృష్టి పెట్టాడు. అలా మొదలైన తన నాటుకోళ్ల బిజినెస్.. ప్రస్తుతం సంవత్సరానికి 2 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. ప్రస్తుతం తనొక్కడే కాదు.. పది మందికి ఉపాధి కూడా కల్పించాడు.

నిజానికి.. ఆయన నాటుకోళ్ల బిజినెస్ అనేది వెంటనే సక్సెస్ అయిందేమీ కాదు. ముందు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో చాలా సమస్యలు రావడంతో.. తనకు తెలిసిన విద్యను నమ్మకున్నాడు. సోషల్ మీడియా మీద దృష్టి కేంద్రీకరించాడు. సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టడంతో.. అప్పుడు సక్సెస్ అయ్యాడు ప్రదీప్. నాటు కోళ్ల గురించి.. ఎన్ని రకాలు కోళ్లు తన దగ్గర ఉన్నాయి.. వాటి ధర, తన ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ సోషల్ మీడియాలో ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసేలా చేశాడు. దీంతో ప్రదీప్ కు గిరాకీ పెరిగింది. ప్రదీప్ దగ్గర చాలా రకాల నాటు కోళ్లు ఉన్నాయి. కడక్ నాథ్ కోళ్లు, సిల్కీ కోళ్లు, జీవీ 380 కోళ్లు, ఆర్ఐఆర్ కోళ్లు, టర్కీ, గిన్ని జాతి కోళ్లు, బాతులు.. ఇలా రకరకాల కోళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వెయ్యికి పైగా కడక్ నాథ్ కోళ్లు ఉన్నాయి. అలాగే.. ఇతర జాతికి చెందిన సుమారు 2 వేల వరకు కోళ్లు ఉన్నాయి.

పందెం కోళ్లను కూడా ప్రదీప్ అమ్ముతున్నాడు. పెరువియన్ అనే జాతికి చెందిన పందెం కోళ్లు అవి. ఆ పందెం కోళ్ల ధర ఒక్కొక్కటి 3 లక్షల వరకు పలుకుతుందట. వాటి గుడ్డు ధరే 3 వేలు ఉంటుందట. అలాగే.. రసంగి, సీతువా, వైట్ నాట్, బ్లాక్ నాట్ అనే జాతి కోళ్ల ధర కూడా ఆన్ లైన్ లో 3 లక్షల వరకు పలుకుతుందట. తన దగ్గర ఉండే పందెం కోళ్లలో లక్ష రూపాయల ధర నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే కోళ్లు ఉన్నాయట. మీకింకో విషయం తెలుసా? ప్రదీప్.. కోళ్లతో పాటు.. దేశీయ కుక్కలను కూడా తన ఫామ్ లో పెంచుతున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif