Srikakulam Youth Dies In US: అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే విషాదం

ఉపాధి కోసం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం జిల్లా యువకుడు రవికుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

Credits: Facebook

Srikakulam, Jan 27: ఉపాధి కోసం అమెరికా (America) వెళ్లి ఉద్యోగంలో (Job) చేరిన మూడు రోజులకే శ్రీకాకుళం (Srikakulam) జిల్లా యువకుడు  ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సంతబొమ్మాళి (Santhabommali) మండలంలోని ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన టి. రవికుమార్ (35) నౌకలో పనిచేసేందుకు మరో 10 మందితో కలిసి ఈ నెల 17న అమెరికా వెళ్లాడు. మూడు రోజుల క్రితం అక్కడ సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు.

హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు షురూ.. భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో ముందే కూల్చేయాలని నిర్ణయం

బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు కంటెయినర్‌ పైనుంచి జారిపడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్నికుటుంబ సభ్యులకు తెలియజేశారు. రవికుమార్‌కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవికుమార్ మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్.. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement