Credits: Twitter

Newdelhi, Jan 27: కేంద్ర బడ్జెట్ (Central Budget) ప్రకటన ముంగిట పార్లమెంటులో (Parliament) ఆర్థికమంత్రి (Finance Minister) హల్వా (Halwa) తయారుచేయడం ఆనవాయతీ అని తెలిసిందే. ఓ సంప్రదాయంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కూడా ఆచరించారు. పార్లమెంటు ప్రాంగణంలో హల్వా తయారుచేసిన నిర్మల అందరికీ వడ్డించారు.

అక్కినేని తొక్కినేని వ్యాఖ్యల వివాదంపై బాలకృష్ణ క్లారిటీ, అనుకోకుండా ఫ్లోలో ఆ మాట వచ్చేసింది, నాగేశ్వరరావు నాకు బాబాయి లాంటి వారు..

ఆర్థికశాఖ సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగ్వత్ కిసాన్ రావు కరాద్ లకు, ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు నార్త్ బ్లాక్ లోని ఇతర మంత్రిత్వ శాఖల అధికారులకు తియ్యని హల్వా తినిపించారు. నిర్మలా సీతారామన్ పెద్ద బాండీలో హల్వాను గరిటెతో తిప్పుతూ ఈ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కరోనా కారణంగా ఓ ఏడాది హల్వా తయారీ కార్యక్రమాన్ని నిర్వహించకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు.  2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు.

రిపబ్లిక్ డే వేదికగా తెలంగాణలో కొనసాగుతున్న గవర్నర్ వర్సెస్ సీఎం కేసీఆర్ తగాదా, రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ డుమ్మా..