Road Accident in US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెనాలి యువతి దుర్మరణం.. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళిన మృతురాలు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు.

Parimala (Credits: X)

Newyork, Dec 15: అమెరికాలో (America) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం పాలయ్యారు. బాధితురాలు తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్-రమాదేవి దంపతుల కుమార్తె. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం పరిమళ  అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుకుంటున్నారు. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు ‘తానా’ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

అసలేం జరిగింది?

శుక్రవారం రాత్రి పరిమళ ఏదో పనిమీద బయటకు వచ్చారు. అయితే, ఇదే సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తుతెలియని ట్రక్ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement