Hyderabad, Dec 15: నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు (Group 2 Exams) సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను (Exam Centres) ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌ లో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్‌ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతీ అభ్యర్థి బయోమెట్రిక్‌ హాజరును నమోదుచేయాలని, లేదంటే జవాబుపత్రాన్ని తిరస్కరిస్తామని వెల్లడించారు. మార్చిలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

వారి పరిస్థితి??

5.51లక్షల మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు కేవలం 77% మంది అభ్యర్థులు మాత్రమే హాల్‌ టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. మరి మిగతావారు పరీక్షకు హాజరు అవుతారా? లేదా అని సస్పెన్స్ కొనసాగుతుంది.

అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల