TSPSC (Photo-Wikimedia Commons)

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలకు సంబంధించి అధికారిక నోటీసు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో అభ్యర్థులకు అందుబాటులో ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు. గ్రూప్ 1 ద్వారా 563 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..

గ్రూప్ 2లో 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1388 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది, గ్రూప్‌ 3 పోస్టులకు సైతం 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.