AP Shocker: మంచి నిద్రలో భర్త.. సలసల కాగే నీటిని పురుషాంగంపై పోసిన భార్య, విలవిలలాడుతూ ఆస్పత్రికి పరిగెత్తిన బాధితుడు, ఏలూరులో దారుణ ఘటన
భార్యా భర్తల మధ్య విభేధాలు తీవ్రం కావడంతో నిద్రపోతున్న భర్త పురుషాంగంపై (Wife pours hot water on husband's private parts ) అతని భార్య సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది.
Eluru, Oct 17: ఏపీలో ఏలూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య విభేధాలు తీవ్రం కావడంతో నిద్రపోతున్న భర్త పురుషాంగంపై (Wife pours hot water on husband's private parts ) అతని భార్య సలసలా మరుగుతున్న వేడినీటిని పోసేసింది. హఠాత్తు పరిణామంతో వేడిని తట్టుకోలేక చావుకేకలు పెట్టిన భర్తను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఏలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నగరం తాపీమేస్త్రి కాలనీకి చెందిన మాచర్ల నాగేంద్రరావు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య పద్మావతితో పాటు, ఇంజనీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు. నగరంలోని పత్తేబాదలో టైలరింగ్ షాపు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా నాగేంద్రరావు, పద్మావతి మధ్య విభేదాలు పొడచూపాయి. శుక్రవారం రాత్రి వారి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. శనివారం ఉదయం భర్త నిద్రిస్తున్న సమయంలో సలసలా మరిగే వేడినీటిని అతని మర్మాంగంపై (Wife pours boiling water on hubby's penis) పడేలా ఒక్కసారిగా పోసేసింది.
తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబ సభ్యులు ఏలూరు కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు నాగేంద్రరావుకు వైద్య చికిత్స అందిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్‌ఆర్ కిషోర్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. కాగా నాగేంద్రరావుకు పద్మావతి మూడో భార్య అని సమాచారం. మొదటి, రెండవ భార్యల నుంచి పిల్లలు పుట్టటం లేదనే కారణంగా విడాకులు తీసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పిల్లలు కావాలనే ఉద్దేశంతో పద్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం కూడా కలిగారు.
అయితే ఇటీవల కాలంలో వారిమధ్య విభేదాలు తీవ్రస్థాయిలో చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడికి దిగిందని భావిస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలా, వివాహేతర సంబంధాలా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు.