Teacher's Fight in Bihar(Photo-Video Grab/ @manishndtv)

Patna, Oct 15: బీహార్ రాష్ట్రంలో ఇద్దరు టీచర్లు ప్రిన్సిపాల్ పోస్ట్ కోసం కొట్టుకుంటున్న (Teacher's Fight in Bihar) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు 150 కి.మీ దూరంలో చంపారన్ జిల్లాలో గల మోతీహ‌రిలో రింకీ కుమారి, శివ‌శంక‌ర్ గిరి అనే ఇద్ద‌రు టీచ‌ర్లు అదాపూర్ ప్రాథ‌మిక‌ పాఠ‌శాల‌లో ప‌ని చేస్తున్నారు. బడిలో ప్రిన్సిపాల్ పోస్టు (School principal’s post spurs violent fight) కోసం వీరిద్దరు మూడు నెల‌లుగా పోటీ ప‌డుతున్నారు.

అందుకోసం విద్యాశాఖ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయురాలి భ‌ర్త‌, పోటీపడుతున్న ఉపాధ్యాయుడు విద్యాశాఖ కార్యాల‌యంలోనే (Education dept office in Bihar’s Motihari) కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించి దృశ్యాల‌ను అక్క‌డి సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌లో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

ప్రిన్సిపాల్ పోస్టు కోసం రాష్ట్ర విద్యాశాఖ కార్యాల‌యానికి వెళ్లారు. ఆ ఇద్ద‌రు టీచ‌ర్ల విద్యార్హ‌త‌ల ప‌త్రాల‌ను మూడు రోజుల్లోగా స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. అయితే, వారిద్ద‌రిలో ఎవ‌రు మొద‌ట వాటిని స‌మ‌ర్పిస్తారు? అనే విష‌యంలో రింకీ భ‌ర్త‌కు, శివ‌శంక‌ర్ గిరికి మ‌ధ్య గొడ‌వ చోటు చేసుకుంది. దీంతో వారిద్దరు ప‌ర‌స్ప‌రం కొట్టుకున్నారు. శివ‌శంక‌ర్ గిరిని రింకీ భ‌ర్త‌ కింద‌ప‌డేసి కొట్టాడు.

Here's Fight Video

శివ శంకర్‌ను ఎటు కదలనీయకుండా చేసిన రింకీ భర్త.. చివరకు కింద పడేవరకు అతన్ని వదల్లేదు. అక్కడున్న వారు వారిద్దర్నీ విడదీయడానికి ఎంతగా యత్నించినా వారు మాత్రం రెచ్చిపోయి మరీ ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

దుర్మార్గపు భర్త.. భార్యను చంపేందుకు నాగుపామును వదిలాడు, అది కాటేయడంతో భార్య మృతి, నిందితుడికి జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

మరొక సంఘటనలో, తమిళనాడులోని చిదంబరంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుడు 12 వ తరగతి విద్యార్థిని తన్నాడు. అతని ఉపన్యాసానికి హాజరుకాకుండా కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఈ క్రూరత్వాన్ని క్యాప్చర్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Here's Karti P Chidambaram Tweet

టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తులతో అది భారీ ఆగ్రహానికి దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం విద్యార్థిపై జరిగిన క్రూరత్వాన్ని విమర్శించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.