Karnataka Shocker: కొడుకా లేక ఉన్మాదా, సాంబారు రుచిగా చేయలేదని తల్లిని, చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన తాగుబోతు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అతని తండ్రి, నిందితుడు అరెస్ట్
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కొడగోడులో దారుణం (Karnataka Shocker) చోటు చేసుకుంది. సాంబారు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లి, సోదరిని కాల్చి (Youth kills mother and sister) చంపాడో ఉన్మాది.
Kodagodu, Oct 15: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కొడగోడులో దారుణం (Karnataka Shocker) చోటు చేసుకుంది. సాంబారు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లి, సోదరిని కాల్చి (Youth kills mother and sister) చంపాడో ఉన్మాది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా కుడగోడుకు చెందిన మంజునాథ్ హస్లర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం తాగిన మత్తులో ఇంటికొచ్చిన మంజునాథ్ భోజనం చేస్తూ సాంబారు (not cooking tasty sambar) పోసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి అది రుచించలేదు.
దీంతో సాంబారును ఇంత దరిద్రంగా ఎలా చేశారంటూ తల్లి పార్వతి నారాయణ హస్లర్ (42), సోదరి రమ్య నారాయణ హస్లర్ (19)తో వాగ్వివాదానికి దిగాడు. అది మరింతగా ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంజునాథ్ తన వద్ద ఉన్న నాటు తుపాకితో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడు. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నిందితుడు తాగుబోతు అని తెలుస్తోంది. పార్వతి తన సోదరి కోసం సెల్‌ఫోన్ కొనాలా వద్దా అని నన్ను అడగలేదని మంజునాథ్‌తో చెప్పినట్లు తెలిసింది. ఈ సమయంలో, కోపంతో ఉన్న మంజునాథ్ ఇంట్లో ఉన్న ఒక దేశీయ తుపాకీతో ఆమెను కాల్చాడు. తరువాత, అతను తన సోదరిని కూడా కాల్చాడని పోలీసులు చెప్పారు. నిందితుడి తండ్రి ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 15, 2021 01:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

