Elephants At Tirumala Ghat: వణికిపోతున్న శ్రీవారి భక్తులు, తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌చల్‌, ఎప్పుడు దాడికి దిగుతాయో అని పరుగులు

ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది. గుంపులో ఐదు మదపటేనుగులు (Elephants at Tirumala Ghat), ఒక గున్న ఏనుగు ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్ లో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు

Tirupati, April 15: తిరుమల మొదటి ఘాట్ రోడ్ (Tirumala Ghat) లో ఏనుగులు (Elephants) హల్ చల్ చేశాయి. ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది. గుంపులో ఐదు మదపటేనుగులు (Elephants at Tirumala Ghat), ఒక గున్న ఏనుగు ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్ లో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని కంగారు పడుతున్నారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు వద్ద అంటే ఆంజనేయ స్వామి విగ్రహానికి అత్యంత సమీపంలో శనివారం సాయంత్రం ఏనుగుల సంచారాన్ని భక్తులు గుర్తించారు. రోడ్డుకు పక్కనే ఈ ఏనుగులు సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

Drone Over Srisailam Temple: శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. ఆలయంపై ఆకాశంలో డ్రోన్ చక్కర్లు.. సత్రాలపై కూడా ఎగిరిన డ్రోన్.. డ్రోన్ ఎగరేసిన వ్యక్తుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు  

కాగా, ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో తరుచుగా ఏనుగులు రావడం జరిగింది. ఐదారుసార్లు ఏనుగులు వచ్చాయి. రోడ్డు మీదకు కూడా ఏనుగులు వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడున్న వెదురు పొదలను ధ్వంసం చేయడం, తినడము ఆ తర్వాత వెళ్లిపోవడం గతంలోనూ జరిగింది.

Adulterated Ice Creams: సమ్మర్ అని ఐస్‌క్రీమ్స్ తెగ లాగించేస్తున్నారా? పైన బ్రాండెడ్ స్టిక్కర్, లోపల నకిలీ ఐస్‌క్రీమ్, హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు 

అదే విధంగా శనివారం సాయంత్రం కూడా ఏనుగులు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు, స్థానికులు ఏనుగులను చూశారు. వెంటనే వాటిని తమ ఫోన్లలో వీడియో తీశారు. ఏనుగులు ఎక్కడ తమపై దాడికి దిగుతాయోనని భక్తులు, స్థానికులు కాస్త భయాందోళనకు గురయ్యారు.



సంబంధిత వార్తలు

Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. స‌త్య‌సాయి జిల్లాలో నలుగురు మృతి

Raigad Road Accident: రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తా పడిన పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, 5 మంది మృతి, 27 మందికి గాయాలు

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif