
Delhi, 26: జెఎంఎం ఎంపీ మహువా మాజీ మహా కుంభ్ నుండి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు(JMM MP Mahua Maji Injured). బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మహువా కారు ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఎడమ మణికట్టులో ఎముక విరిగి రాంచీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారు తెలిపారు. మహువాతో పాటు ఆమె కుమారుడు సోమవిత్ , కోడలు కృతి శ్రీవాస్తవా మరియు డ్రైవర్ భూపేంద్రా గాయపడ్డారు. మహా కుంభ్(Maha Kumbh) పవిత్ర స్నానానికి వెళ్లి తిరిగి రాంచీకి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన
బుధవారం ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగిన వెంటనె లాటేహార్ జిల్లా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను తక్షణమే లాటేహార్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం రాంచీ ఆస్పత్రికి తరలించారు.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆమెకు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మారండి కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.