IPL Auction 2025 Live

Volunteers Apology to AP CM: మమ్మల్ని క్షమించండి, విజయవాడ ధర్నాలో మా ప్రమేయం లేదు, కొంతమంది వ్యక్తుల ప్రలోభాలకు వాలంటీర్లు లోనయ్యారు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని స్పష్టం చేసిన వాలంటీర్లు

ఈ విషయంపై ఏపీ సీఎం (cm ys jagan mohan reddy) వారి విధి విధానాలు, సమయం గురించిన వివరాలతో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ లేఖపై వాలంటీర్లు స్పందించారు.

Andhra pradesh : Pensions distributed to beneficiaries at doorstep (photo-Facebook)

Amaravati, Feb 10: ఈ మధ్య విజయవాడలో వాలంటీర్లు జీతాలు పెంచాలంటూ ధర్నా చేసిన సంగతి విదితమే. ఈ విషయంపై ఏపీ సీఎం (cm ys jagan mohan reddy) వారి విధి విధానాలు, సమయం గురించిన వివరాలతో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ లేఖపై వాలంటీర్లు స్పందించారు. విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రలోభాల వలన కొందరు వాలంటీర్లు అలా చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ. ‘‘ఆ రోజు మేము వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాము. విజయవాడలో జరిగిన ఘటనలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వాలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్‌కి క్షమాపణలు (Volunteers Apology to AP CM) చెబుతున్నాము’’ అన్నారు. సీఎం జగన్‌ వాలంటీర్లుకు రాసిన లేఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. దీని ద్వారా ఆయన మాకు క్లారీటీ ఇచ్చారు. గతంలో ప్రతి రోజు ఆఫీసుకి రావాలి.. లేకపోతే మీ జీతాలు కట్ అవుతాయి అని చెప్పేవారు.

మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది, రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడవద్దు, మీకు ఇన్ని రోజులు పని చేయాలనే నిబంధనలు లేవు, వాలంటీర్లకు సీఎం జగన్ రాసిన లేఖ పూర్తి సారాంశం ఇదే..

అయితే సీఎం రాసిన లేఖ ద్వారా మా విధివిధానాలు తెలుసుకున్నాం. వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే సేవ చేయ్యండని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వాలంటీర్లు స్పష్టం చేశారు.