Nara Bhuvaneswari Shares Gained: కేవలం ఐదు రోజుల్లోనే రూ. 535 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి, ఏపీలో కూటమి గెలుపుతో రోజుకు రూ. 100 కోట్లకు పైగా లాభం
ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది.
Hyderabad, June 07: దేశీయ స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) ఆల్‌టైమ్ రికార్డులను సాధించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ కంపెనీ షేర్లపై భారీ లాభాలను అందుకుంది. ఇటీవల లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఫలితంగా హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు గత ఐదు రోజుల్లో 55 శాతం పెరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్థాపించిన ఈ కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొన్ని గంటల ముందు.. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ రూ. రూ.424 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయింది.
బీఎస్ఈ డేటా ప్రకారం.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి టాప్ షేర్ హోల్డర్‌గా నిలిచారు. ఆమె మొత్తం 2,26,11,525 స్టాక్‌లను కలిగి ఉన్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ (Nara lokesh) హెరిటేజ్ ఫుడ్స్‌లో 1,00,37,453 షేర్లను కలిగి ఉన్నారు. స్టాక్ పెరిగిన తర్వాత భువనేశ్వరి (Bhuvaneswari) సంపద 5 రోజుల్లో రూ. 535 కోట్లు, నారా లోకేష్ నికర విలువ కూడా రూ. 237.8 కోట్లు పెరిగింది. హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం 35.7 శాతం వాటా ఉంది.