Vjy, June 7: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినప్పటికీ అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో టీడీపీ అధినేత తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.
జూన్ 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. అనంతంర అమరావతి ప్రాంతంలో భారీ బహిరంగ సభలో చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు, కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యంపై ప్రముఖంగా చర్చలు
తొలి విడతగా దాదాపు పది మంది చంద్రబాబుతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాయారం. వీరిలో టీడీపీ నుంచి ఐదారుగురు, జనసేన, బీజేపీ నుంచి నలుగురు ఉన్నట్లు సమాచారం. తొలి విడతలో కింజరాపు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు వంటి వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇక జనసేన నుంచి నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున సుజనాచౌదరికి మంత్రి వర్గంలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీడియో ఇదిగో, నరేంద్ర మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం, పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు వార్తలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆనం రామనారాయణరెడ్డిని నియమించే యోచనలో టీడీపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణరాజు స్పీకర్ పదవి కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరని సమాచారం.