Weather Forecast: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, డిసెంబరు 22 నుంచి 28 మధ్య నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన, మళ్లీ తమిళనాడుకు భారీ వర్షాల ముప్పు

ముందుగా ఊహించినట్లుగానే శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం ఉంది.

Rains (Photo Credits: PTI)

Vjy, Dec 20: దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం భారీ అల్పపీడనం (Low pressure area) కొనసాగుతోంది. ముందుగా ఊహించినట్లుగానే శ్రీలంకకు దగ్గర్లో ఇది కేంద్రీకృతం అయి ఉంది. మరోవైపు అరేబియా మహాసముద్రంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా భారీ అల్ప పీడనం దిశ మారే అవకాశం ఉంది. అండమాన్‌ దీవులకు దక్షిణంగా ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి మరింత బలపడి బంగాళాఖాతం (Bay of Bengal) ఆగ్నేయ ప్రాంతంలో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

ప్రియుడితో రూంలో శృంగారం, మరో మహిళకు అది ఎలా ఇస్తావంటూ బ్లేడుతో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు, కోనసీమ జిల్లాలో దారుణ ఘటన

వాయవ్య దిశగా కదులుతూ ఎల్లుండికి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో రేపు సాయంత్రం నుంచి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు (Rains will continue) పడతాయని వివరించింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

మహిళ నీచ బుద్ధి, యువకులకు, వృద్ధులకు నగ్న ఫోటోలు పంపి డబ్బులు వసూలు, నిందితురాలిని అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు

ఆంధ్రప్రదేశ్ పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబరు 22 నుంచి 28 మధ్య కాలంలో దక్షిణ భాగాలైన తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.