AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.
Vijayawada, July 14: ఏపీలోని (AP) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో (Ambedkar Konaseema District) దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబు(Ewer)తో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన ఇసుకపట్ల రామకృష్ణ (34) రోజూ తాగొచ్చి భార్యతో పాటూ తల్లిదండ్రులపైనా (Parents) చేయి చేసుకునేవాడు. భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య సత్య నారాయణమ్మ ఇటీవల ఓ రోజు అతడి తలపై చెంబుతో బలంగా కొట్టింది.
ఒక్క దెబ్బకు..
నారాయణమ్మ కొట్టిన ఒక్క దెబ్బకు రామకృష్ణ మరణించాడు. భర్త హింసను భరించలేకే అతడిని కడతేర్చినట్టు ఆమె కుటుంబసభ్యులకు చెప్పింది. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయింది. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement