Srikakulam Shocker: దారుణం..నచ్చిన ఛానల్ చూపిస్తానంటూ బాలికపై అత్యాచారం, శ్రీకాకుళం జిల్లాలో కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, తన శరీరంలో మార్పులను కూడా గ్రహించలేకపోయిన పల్లెటూరి బాలిక

12 ఏళ్ల వయసు కూడా దాటని బాలిక ను భయపెట్టి.. మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు (Youth Accused Of Molesting 12 Year Old Girl) లోబర్చుకున్నాడు. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Image used for representational purpose | (Photo Credits: File Image)

Srikakulam, June 19: అభం..శుభం తెలియని.. 12 ఏళ్ల వయసు కూడా దాటని బాలిక ను భయపెట్టి.. మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు (Youth Accused Of Molesting 12 Year Old Girl) లోబర్చుకున్నాడు. టీవీ చూసేందుకు రమ్మని పిలిచి లైంగిక దాడికి పాల్పడడంతో ఆ చిన్నారి గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అసలు నిజాన్ని రాబట్టారు. ఈ ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లా జి. సిగడాం మండలం గెడ్డకంచరాంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడ్డకంచరాం గ్రామానికి చెందిన లొట్ట అనిల్‌ (26) దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలిక కుటుంబం కూడా నిరుపేదలు. వారి ఇంట్లో టీవీ లేకపోవడంతో పక్క ఇంట్లో ఉంటున్న డొంక సవరయ్య గృహానికి వెళ్తుండేది. ఈ విషయాన్ని గమనించిన అనిల్‌ బాలికకు మాయ మాటలు చెప్పాడు. తన ఇంట్లో ఉన్న టీవీ చూసేందుకు వస్తే నచ్చిన చానల్‌లో.. ఇష్టమైన ప్రోగ్రాం చూసుకోవచ్చని నమ్మించాడు.

ఉన్మాది ఘాతుకం, అందుకు ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి చంపేశాడు, చింతల చెరువు గ్రామంలో దారుణ ఘటన, నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు

దీంతో అనిల్‌ మాటలను నమ్మిన చిన్నారి.. అతని ఇంటికి టీవీ చూసేందుకు అతని వెళ్లేది. దీన్ని అనుకూలంగా మలుచుకున్న అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో చిన్నారి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కొన్ని నెలల తర్వాత బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ విషయం కూడా ఆమెకు కూడా తెలియలేదు. కరోనా నేపథ్యంలో వలస వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు తన కుమార్తెలో వచ్చిన శారీక మార్పులతో ఆందోళన చెందారు. రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్ష లు చేసిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించడంతో షాకయ్యారు.

ఇంటికి వచ్చేసి ఏం జరిగిందంటూ ఆబాలికను ఆరా తీశారు. అనిల్‌ టీవీ చూసేందుకు రమ్మని చెప్పి.. బలవంతం చేసినట్టు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం జి.సిగడాం పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.ఎ.అహ్మద్‌ కేసు నమోదు చేసి.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. యువకుడిని అరెస్టు చేశామని ఎస్‌ఐ చెప్పారు.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif