Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.

Sankranti Heavy Rush (Credits: X)

Hyderabad, Jan 11: పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti) పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు. పల్లెలకు వడివడిగా పయనమవుతున్నారు.  బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాల్లో పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరారు. చాలామంది కార్లు, ఇతర వాహనాల్లో బయలుదేరడంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో చాలామంది నిన్న రాత్రి నుంచే కార్లు, ఇతర వాహనాల్లో తమ తమ గ్రామాలకు బయలుదేరారు.

ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి

జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో..

పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే మార్గంలో సాధారణంగా 8 టోల్ బూత్‌లు తెరిచి ఉంటాయి. సంక్రాంతి కోసం వాహనాలు బారులు తీరిన నేపథ్యంలో మరో రెండు బూత్‌ లను తెరిచారు. పంతంగి టోల్ గేట్ వద్ద పదుల సంఖ్యలో పోలీసులు పని చేస్తున్నారు. చౌటుప్పల్‌ లో ఫ్లైఓవర్ లేకపోవడంతో ఇక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు అంతరాయం కలగకుండా విధులు నిర్వహిస్తున్నారు. పండుగ నేపథ్యంలో జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో.. సికిందరాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ పెద్దయెత్తున రద్దీ కనిపిస్తున్నది.

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement