Minister Ponnam Prabhakar: 35 శాతం కుటుంబ సర్వే పూర్తి..ఎలాంటి అపోహలు వద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రజలంతా స్వచ్ఛందంగా సర్వేకు సహకరిస్తున్నారన్న పొన్నం
సర్వే పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు.
Hyd, Nov 15: సిద్ధిపేట జిల్లా దుద్దెడ గ్రామంలో 9 వ వార్డు లో పంజాల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వే పై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్చందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా కోఠి 16 లక్షల ఇళ్లకు 85 వేల మంది ఎన్యుమరెటర్స్ తో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని..ఇప్పటివరకు 35 శాతం సర్వే పూర్తైందన్నారు. అధికారులకు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా సహకరిస్తున్నారు అని తెలిపిన పొన్నం...రాజకీయ పార్టీలు అనవసర దుష్ప్రచారం చేస్తున్నారన్నారుజ
దుద్దెడలో పంజాల కవిత ఇంటింటికీ వచ్చాం..ఎక్కడా ఇబ్బందికర ప్రశ్నలు లేవు అన్నారు. కేటీఆర్‌వి పొలిటికల్ డ్రామాలు, అధికారం కోసం ఇంతగా దిగజారాలా అని మండిపడ్డ అద్దంకి దయాకర్, తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని కామెంట్
బ్యాంకు అకౌంట్లు ,డాక్యుమెంట్ లు అడగడం లేదు..కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ ఉందన్నారు. తెలంగాణ లో కొత్త ప్రణాళిక తో ప్రజా పాలన ద్వారా ముందుకు పోతున్నాం..అందరూ స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్యుమరేటెర్స్ ను ఇబ్బంది పెడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.