KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

KCR (Credits: TS CMO)

Hyderabad, Dec 4: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ (Congress) విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ (BRS) రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీల గెలుపోటములు ఖరారైందని తెలిసిన వెంటనే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంవో ప్రధాన కార్యదర్శికి లేఖను అందించి గవర్నర్‌కు సమర్పించాల్సిందిగా కోరారు. ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటలకు ప్రగతిభవన్ నుంచి తన నియోజకవర్గానికి (గజ్వేల్) బయలుదేరారు.

Mizoram Election Counting LIVE: మిజోరంలో కౌంటింగ్ ప్రారంభం.. ఎమ్ఎన్ఎఫ్, జెడ్‌పీఎమ్, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ.. జెడ్‌పీఎమ్ క్లీన్ స్వీప్ చేయనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా

ఏం జరిగింది?

సాయంత్రం 4 గంటల సమయంలో ప్రగతిభవన్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ దగ్గరికి సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చారు. అయితే, ఆయన్ని వద్దని కేసీఆర్ వారించారు. కాన్వాయ్ లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్‌ లు తీసుకోకుండా ఓ సామాన్య పౌరుడిగా ఆయన పయనమయ్యారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ వాహనంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి (ఫామ్ హౌస్) వెళ్లారు. వాహనంలో ముందు సీట్లో సంతోష్‌ కుమార్ వెనక సీట్లో కేసీఆర్ మాత్రమే ఉన్నారు. ఆయన వెనుక గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మరో వాహనంలో కేసీఆర్‌ ను అనుసరించారు. గన్‌ మెన్లను కూడా కేసీఆర్ వెంట రానీయలేదు.

Cyclone Michaung Alert: నేడు, రేపు స్కూళ్లకు సెలవు...నెల్లూరు, ప్రకాశం వైపు దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాను

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement