Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Aramghar-Zoo Park flyover Launched by CM Revanth Reddy (Photo-Video Grab)

Hyd, Jan 6: ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ (Aramghar Zoo Park flyover)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కాగా ఈ ఫ్లై ఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని సూచిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో 11.5 కి.మీ మేర అతిపెద్ద పైవంతెన ( పీవీ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌) నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించుకుని మనకు మనమే పోటీ అని నిరూపించుకున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు.

తెలంగాణలో సవరించిన ఓటరు జాబితా ఇదిగో, రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు,శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది ఓటర్లు

ఆనాడు నిజాం హయాంలో ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ లను నిర్మించి హైదరాబాద్ తాగునీటి సమస్యను తీర్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనం లాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా మేం సిద్ధం. హైదరాబాద్ అభివృద్ధికి ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామన్నారు.

CM Revanth Reddy Speech 

CM Revanth Reddy:

Hyderabad’s Second longest Flyover to be named after Dr Man Mohan Singh

ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

🔸వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్ప్రెస్ వే నిర్మించుకున్నాం.

🔸మళ్లీ ఇప్పుడు రెండో అతిపెద్ద ఫ్లై… pic.twitter.com/MTSsQkPatL

#Hyderabad :

The city’s second longest #Flyover from #Aramghar to #ZooPark flyover opened for the public today.

The flyover was inaugurated by the Chief Minister #RevanthReddy in the presence of AIMIM chief Hyderabad MP #AsaduddinOwaisi , MLA #AkbaruddinOwaisi , GHMC Mayor… pic.twitter.com/YAV56RaHfp

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, నగర అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతాం. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ మరింత ముందుకు వెళుతుంది. ఇది ఓల్డ్ సిటీ కాదు… ఒరిజినల్ సిటీ.. ఒరిజినల్ హైదరాబాద్. మిరాలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది… పనులు పూర్తి చేసే బాధ్యత ఇక్కడి ప్రజా ప్రతినిధులదే. త్వరలోనే గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.

ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ ను 4.08 కిలోమీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పుతో అధికారులు దీన్ని నిర్మించారు. జూపార్కు నుంచి ఆరాంఘర్‌ వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో ఈ పైవంతెనను బల్దియా నిర్మించింది. నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే రెండో అతి పెద్ద ఫ్లైఓవర్. ఆరాంఘర్ ఫ్లైఓవర్ రాకతో బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తేలికగా ప్రవేశించవచ్చు. అలాగే ఎంజీబీఎస్ బహదూర్‌పుర నుంచి ఎయిర్‌పోర్ట్‌, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్లొచ్చు. తాడ్ బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్‌ పైనుంచి నగర వాసులు సులభంగా ప్రయాణించవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకూ 36 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి వచ్చాయి. కాగా, 37వ ప్రాజెక్టుగా ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క..చిన్నారిని చూసి భావోద్వేగానికి లోనైన సీతక్క, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన మంత్రి

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Share Now