Ancient Stoneware: ఈ పాత్ర రెండువేల ఏళ్ల నాటిది.. బాన్సువాడలో బయటపడింది.. బోర్లాం గ్రామంలో మట్టి దిబ్బపై లభ్యం.. ప్రాకృత భాష, బ్రహ్మీలిపిలో లఘుశాసనం.. శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తింపు

ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్ సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు.

Ancient Bowl (Credits: Google)

Hyderabad, October 30: తెలంగాణలోని (Telangana) కామారెడ్డి జిల్లా (Kamareddy) బాన్సువాడలో (Banswada) రెండువేల సంవత్సరాల నాటి పాత్ర లభ్యమైంది. ఈ మేరకు తెలుగు యూనివర్సిటీ (Telugu University) అసిస్టెంట్ ప్రొఫెసర్, పబ్లిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ హెరిటేజ్  సంస్థ (ప్రిహా) ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాస్ తెలిపారు. బాన్సువాడ సమీపంలోని బోర్లాం గ్రామంలో ఓ మట్టిదిబ్బపై ఈ పాత్ర లభించినట్టు చెప్పారు. దీనిపై క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రహ్మీ లిపిలో లఘుశాసనం ఉన్నట్టు పేర్కొన్నారు.

మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరోదని శ్రీనివాస్ వివరించారు. మంజీరా నదికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది లభించినట్టు పేర్కొన్నారు. దీనిని శాతవాహన కాలం నాటి చారిత్రక అవశేషంగా గుర్తించినట్టు చెప్పారు. పాత్రపై ఉన్న శాసనంలో ‘హిమాబుధియ’ అని ఐదక్షరాలతో బ్రహ్మీ లిపి ఉందన్న ఆయన.. హిమా పదానికి స్త్రీ బౌద్ధ భిక్షువు అని అర్థం కావొచ్చని దీనిని పరిశీలించిన ఎపిగ్రఫిస్ట్ మునిరత్నం రెడ్డి పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)

Zombie Virus: ఆర్కిటిక్ మంచు కప్పుల క్రింద మరో ప్రమాదకర జోంబీ వైరస్, ఇది ప్రాణాంతక మహమ్మారిగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

Astrology Horoscope, July 16: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి అఖండ ధనయోగం ప్రారంభం, మీ రాశి చెక్ చేసుకోండి..

Gold Coins Found In Eluru: పైపులైను కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టిపడిత.. తెరిచి చూస్తే మిలమిల మెరుస్తూ కనిపించిన పురాతన బంగారు నాణేలు.. వాటిని చూసి ఆ ఇల్లాలు ఏం చేసింది? ఏలూరు జిల్లాలోని ఏడువాడల పాలెంలో ఘటన