Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ..మొత్తం వివాదానికి కారణం ఇదే, పీఏసీ వ్యవహారం..అగ్నిగుండంలా మారిన రాష్ట్రం!
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిపోయాయి.
Hyd, Sep 13: పార్టీ ఫిరాయింపులు దీనికి తోడు రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) ఛైర్మన్ పదవి వెరసీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిపోయాయి. పీఏసీ ఛైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడంతో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. ఇక తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని గాంధీ ప్రకటించగా దీనికి కౌంటర్ ఇచ్చారు కౌశిక్ రెడ్డి.
గాంధీ బీఆర్ఎస్‌లోనే ఉంటే ఆయనకు గులాబీ కండువా కప్పుతానని, ఆయన ఇంటికి వెళ్లి కేసీఆర్ దగ్గరు తీసుకెళ్తానని ప్రకటించారు కౌశిక్ రెడ్డి. అయితే కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావడం కాదు తానే ఆయన ఇంటికి వెళ్తానని గాంధీ అనుచరులతో సహా బయలుదేరడం...కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.
ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ మధ్య మాటల తూటాలు పేటాయి. సవాళ్లు - ప్రతి సవాళ్లతో హోరెత్తించారు. ముఖ్యంగా గాంధీని ఉద్దేశిస్తూ ఆంధ్రా ప్రాంతం వాడని కౌశిక్ సంబోధించగా...కౌశిక్ ఓ బ్రోకర్ అని మండిపడ్డారు గాంధీ. ఈ క్రమంలో హరీశ్ రావు ఎంటరవడం, పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకోగా హరీశ్ చేతికి గాయం కూడా అయింది. ఆ తర్వాత ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను కట్టడి చేసేందుకు లాఠిఛార్జ్ చేసే వరకు వెళ్లింది. బీఆర్ఎస్‌లోనే ఉన్నా, కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బంది లేదన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్ అని మండిపాటు
ఇక సీన్ కట్ చేస్తే ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు ప్రకటించారు. దీంతో ఇవాళ ఉదయం నుండి బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు శంభీపూర్ రాజు...గాంధీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని నిర్బందించారు. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం
దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌లను ఖండించారు కేటీఆర్. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ఎమర్జెన్సీ అని దుయ్యబట్టారు. రౌడీ మూకలు దాడి చేసినా.. రాళ్ళు రువ్వినా.. దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా… ధైర్యంగా నిలబడి పోరాడిన ప్రతి బీఆర్ఎస్ పార్టీ సోదరుడికి, సోదరికి అలాగే సోషల్ మీడియా లో అండగా నిలిచిన యోధులకి వందనాలు అని పేర్కొన్నారు కేటీఆర్. కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్
ఈ నేపథ్యంలో తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కొందరు వ్యక్తులు శాంతి భద్రతలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చిన్నపాటి సంఘటనలకు కూడా తగిన సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటో, కోడిగుడ్లతో దాడి, అరికెపూడి గాంధీ అనుచరుల బీభత్సం, కౌశిక్ ఇంటికి బయల్దేరిన హరీశ్ రావు..వీడియో
Here's Tweet: