Telangana Job Calendar: తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్

ప్రధానంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన, ధరణి పేరు భూమాతగా మార్చడం, మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన వారిపై చర్యలు వంటి వాటితో వాడివేడిగా సాగింది.

Breaking News, Telangana Job Calendar 2024 Released

Hyd, Aug 2:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు పలు కీలక బిల్లులకు అమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రధానంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన, ధరణి పేరు భూమాతగా మార్చడం, మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన వారిపై చర్యలు వంటి వాటితో వాడివేడిగా సాగింది.

ఇక నిరుద్యోగులకు శుభవార్త చెప్పేలా జాబ్ క్యాలెండర్‌ని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. కొత్తగా ఉద్యోగ నియామకాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు.

అన్ని పోటీ పరీక్షల వరుస తేదీలతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..పరీక్ష సరిగా నిర్వహించలేని కారణంగా రెండుసార్లు గ్రూప్‌-1 రద్దయిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు జారీ చేసిన తీర్పును ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ 1,గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లకు వర్తింప జేసేందుకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు.

ధరణిని భూమాతగా మారుస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూసంస్కరణలకు ఇందిరా గాంధీ శ్రీకారం చుట్టారని...ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిన భూదాన ఉద్యమం తెలంగాణలోనే పుట్టిందని పేర్కొన్నారు. వైఎస్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారని చెబుతూనే మాజీ సీఎం కేసీఆర్‌పై మండిప్డారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నారు. ధరణి తెచ్చిన సమస్యల వల్ల పేద రైతులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని చెప్పారు. ధరణిలో 20 వేలకి పైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.  అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

Here's Tweet:

Telangana Job Calendar 2024 : తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. పరీక్షల తేదీలు ఖరారు.. #telanganajobcalendar #Tolivelugu pic.twitter.com/LqO0HgL82y

 

ప్రధానంగా కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య చివరి రోజు మాటలయుద్ధం జరిగింది. అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించారు. సభలో ఇది మంచి పద్దతి కాదని దానంను స్పీకర్‌ హెచ్చరించడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు దానం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif