KCR New Strategy: సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్? త్వరలో ఎన్నికలు రావడం ఖాయం? మళ్లీ అధికారం మనదేనని సంకేతాలు?

ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్‌గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.

BRS boss KCR new strategy , Next Time BRS Will Be in Power for 15 Years

Hyd, July 27: తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ది ప్రత్యేక శైలీ. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్‌గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.

తెలంగాణ తెచ్చిన పార్టీ రెండు సార్లు బీఆర్ఎస్‌ను తిరుగులేని మెజార్టీతో అధికారంలో నిలబెట్టారు కేసీఆర్. అయితే గత ఎన్నికల్లో అనూహ్యంగా ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అయితే మేజిక్ ఫిగర్‌కు కేవలం 4 స్థానాలను మాత్రమే(కంటోన్మెంట్ ఉప ఎన్నిక)తో కలుపుకుని 65 స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందోననే టెన్షన్ మాత్రం అందరిలో ఉండేది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు రేవంత్. బీఆర్ఎస్‌ఎల్పీ విలీనమే టార్గెట్‌గా ముందుకు కదులుతుండగా ఇప్పటివరకు ఆ పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు.

త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫిరాయింపులను సీరియస్‌గా తీసుకుంది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గతంలో చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలను ప్రజలకు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. పార్టీ మారితే ఉప ఎన్నికలు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు. ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు స్పీకర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తూ రాజకీయ వర్గాల్లో కాకా పుట్టిస్తున్నారు.

పార్టీ మారిన వారిని లైట్ తీసుకుంటున్న కేసీఆర్..మళ్లీ అధికారం మనదేననే ధీమా కేడర్‌లో కల్పిస్తున్నారు. 8 నెలల కాలంలోనే కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని ఇది ప్రజలకు ఎప్పుడో అర్థమైందని చెబుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగామని ఇది ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కూడా. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో తీవ్ర చర్చజరుగుతోంది. ఇది ఎవరికి అనుకూలంగా మారుతుందో తెలియదు కానీ ప్రజలు మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ నేతలపై గులాబీ నేతలు ఫోకస్ పెట్టారు. కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని త్వరలోనే ఇంఛార్జీలను నియమించి ఉప ఎన్నికలకు రెడీ కావాలని సూచిస్తున్నారు. పటాన్‌చెరులో కొలను బాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డితోపాటు మెట్టు కుమార్‌యాదవ్‌ పోటీ పడుతుండగా జగిత్యాలలో ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత ఓరుగంటి రమణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దేవ వసంత పోటీ పడుతున్నారు. ఖైరతాబాద్‌ ఇన్‌చార్జి పదవి కోసం మన్నె గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ పోటీపడుతున్నారు. ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో ఇప్పటికే మాజీ మంత్రి రాజయ్య ప్రచారాన్ని తలపించేలా గ్రామల్లో పర్యటిస్తున్నారు. బాన్సువాడ, భద్రాచలం, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కడితే కేసీఆర్ చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో అధికారం గులాబీ పార్టీదేనన్న ధీమా కేడర్‌లో కలగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే?, కోమటిరెడ్డి వర్సెస్ హరీష్..డైలాగ్ వార్