Balka Suman: కాంగ్రెస్ పార్టీలోకి కోవర్టులను పంపాం.. కాంగ్రెస్ వాళ్లను ఏమీ అనొద్దు.. కార్యకర్తలకు బాల్క సుమన్ హితవు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్న చెన్నూరు ఎమ్మెల్యే
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు.
Hyderabad, Aug 28: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) చెన్నూరు ఎమ్మెల్యే (Chennur MLA) బాల్కసుమన్ (Balka Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) వాళ్లు మనోళ్లేనని, ఆ పార్టీలో మన కోవర్టులు ఉన్నారని, కాబట్టి వారినేమీ అనొద్దని కార్యకర్తలకు హితవు పలికారు. పార్టీ అధిష్ఠానం తనకు చెన్నూరు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తనపై పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్ లోకి వచ్చారని, మిగతా వాళ్లు కూడా వస్తారని, అందరూ మనోళ్లేనని అన్నారు. అసలు విషయం ఏంటంటే.. మనమే కొందరిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించామని, ఈ విషయాన్ని బయట చెప్పొద్దని కోరారు.
కాంగ్రెస్ స్పందన ఏంటంటే?
బాల్క సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మైండ్ గేమ్ లో భాగంగానే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)