Suman on AP Politics: ఏపీని అభివృద్ధి చేసింది చంద్రబాబే, హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవి అన్నదాంట్లో తప్పేముంది.. మీరే బజ్జీగాళ్లు అంటూ ఫైర్
Suman (Photo-Twitter)

సినిమాలతో రాజకీయ నాయకులకు ఏం పని అని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. సినీ నటుల రెమ్యునరేషన్లపై మాట్లాడటాన్ని రాజకీయ నాయకులు మానేయాలని సూచించారు. మా పారితోషికాలతో రాజకీయాలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. గురువారం తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై స్పందించారు.

మా పారితోషికాలపై మాట్లాడడం మానుకోండి, సినీ ప్రముఖుల పారితోషికాలకు, రాజకీయాలకు ఏంటి సంబంధం... సినీ పరిశ్రమ వాళ్లు పకోడీగాళ్లు కాదు, అలా విమర్శించిన వాళ్లే బజ్జీగాళ్లు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడడం బాధ కలిగించింది. రాజకీయాలతో సంబంధం లేని రజనీకాంత్‌పై ఎందుకు బురద చల్లుతున్నారు. రాజకీయ నాయకులకే రెండు, మూడు కుటుంబాలు ఉన్నాయి.

చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో కొడాలి నాని, పకోడీ గాళ్లు కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన గుడివాడ ఎమ్మెల్యే, వీడియో ఇదిగో..

ఆ పేర్లు వెల్లడించను. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు రాజకీయం చేయకూడదన్న చట్టం ఉందా? కొన్ని కారణాల వల్ల ఇంకో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని తప్పుబట్టి పవన్‌పై బురద చల్లడం సమంజసం కాదు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి బాధ? పవన్‌ మాజీ భార్యలు తమకు న్యాయం చేయాలని మిమ్మల్ని ఏమైనా కోరారా? పలు పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. దమ్ముంటే వారిపై కామెంట్‌ చేయండి. రాజకీయంగా పవన్‌ను ఎదుర్కోవాలేగాని, వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. చంద్రబాబు విజన్‌ ఉన్న వ్యక్తి, ఏపీని అన్ని విధాలుగా ఆయనే అభివృద్ధి చేశారని గుర్తు పెట్టుకోవాలి’ అని సుమన్‌ అన్నారు.

చిరంజీవి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ప్రత్యేక హోదా వెనుక ఇంత కథ దాగుందా, బీజేపీ మద్దతు ఇవ్వడంపై రాజకీయాల్లో మొదలైన చర్చ

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ప్రధాని మోడీ ఆ దిశగా ఆలోచించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ కోరారు. సేవ్ కప్-సేవ్ ఎర్త్ అనే నినాదంతో హైదరాబాదు నుంచి అరుణాచలం వరకు చేపట్టిన గో మహాపాదయాత్ర తిరుపతికి చేరుకుంది. కపిలతీర్థం సమీపం నుంచి సినీనటుడు సుమన్ గోమహాపాద యాత్రకు సంఘీభావం తెలిపి అలిపిరి వరకు కొనసాగారు.

ఆవును రక్షిస్తే భూమిని రక్షిస్తాం అనడంలో చాలా అర్ధం ఉందన్నారు. తల్లిపాల తర్వాత గోక్షీరమే చంటిబిడ్డలకు పడతామని గుర్తు చేశారు. గోవును పూజిస్తే అంతా శుభం జరుగుతుందని ప్రజల విశ్వాసమన్నారు. ఇన్ని ఉపయోగాలున్న గోవును రక్షించాలనే భావన అందరిలోనూ ఉండాలన్నారు.