BRS Nanded Meeting: మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలో చేరనున్న ‘మహా’ నేతలు.. వీడియోతో

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ నేడు మహారాష్ట్రలోని నాందేండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది.

Credits: ANI Twitter

Nanded, Feb 5: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా (BRS) మారిన టీఆర్ఎస్ (TRS) నేడు మహారాష్ట్రలోని (Maharastra) నాందేండ్‌లో (Nanded) భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా జనాన్ని తరలించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత, అనుమానాస్పద రీతిలో స్వగృహంలోనే శవమై తేలిన వాణీజయరాం

నేటి సభ నేపథ్యంలో మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుశాల్ భోప్చే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పసులు సమయ్యపోచమ, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ తదితరులు నిన్న ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అలాగే, చత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గోపాల్‌ రిషికార్‌ భారతి, మాజీ మంత్రి డాక్టర్‌ చబ్బీలాల్‌ రాత్రే, మధ్యప్రదేశ్‌ బాలాఘాట్‌ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌భగత్‌ తదితరులు కూడా బీఆర్ఎస్ అధినేతతో భేటీ అయ్యారు. కాగా, నేటి మధ్యాహ్నం కేసీఆర్ ప్రత్యేక విమానంలో నాందేడ్ బహిరంగ సభకు వెళ్తారు. తొలుత గురుద్వారను సందర్శిస్తారు. విలేకరుల సమావేశం అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు.

పండుగ చీరల పంపిణీలో తొక్కిసలాట, నలుగురు మహిళలు మృతి, తమిళనాడులో విషాదం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement