CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.

CapitaLand announces Rs. 450 crore investment for new IT park in Hyderabad(CMO X)

Delhi, January 19:  సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్. క్యాపిటాల్యాండ్ గ్రూప్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్‌ అభివృద్ధికి ముందడుగు పడింది. సింగపూర్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ కీలక ప్రకటన వెలువడింది.

ఇక సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం...ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.

ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు - నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.  రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement