Hyderabad, Jan 19: త్వరలో జారీ చేయనున్న రేషన్ కార్డుల (Ration Cards) ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy On Ration Cards) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని, రాష్ట్రంలోని అర్హులందరికీ కార్డులు ఇచ్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన వారికి ఎవరికైనా కార్డులు రాకుంటే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Ration Cards: రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన@UttamINC #Minister #Congress #RationCards #Telangana https://t.co/IFM6AIkNp1
— Disha Telugu Newspaper (@dishatelugu) January 18, 2025
అర్హుల జాబితా అలా..
కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా, పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల పేర్లను నమోదు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు.