Nara lokesh Kurchi Madathapetti Dialogue Video

కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదిక మీద నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబునాయుడు కోరడం సంచలనం రేపుతోంది.

వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన ర‌విచంద్రారెడ్డి, కారణం ఏంటంటే..

వేదికపైన ఆయన మాట్లాడుతూ.. టీడీపీ (TDP) లో లోకేష్‌ మూడో తరం నేత అని, యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహాసేన రాజేష్‌ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి విదితమే. కాగా తాజాగా చంద్రబాబు ముందే మరో టీడీపీ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ కానట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌ని ప్రకటించండి