Chandrababu meet Amith Shah(ANI)

Vijayawada, Jan 19: విశాఖ ఉక్కు (Visakha Steel) తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఏపీ పర్యటన నిమిత్తం శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగిన అమిత్ షా అటు నుంచి నేరుగా ఉండవల్లి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు, అమిత్ షాతో చంద్రబాబు, పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

వీడియో ఇదిగో, చంద్రబాబు గారూ...డిప్యూటీ సీఎంగా నారా లోకేష్‌ని ప్రకటించండి, మైదుకూరు సభలో టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల సమస్యలు

చంద్రబాబు ఆతిథ్యమిస్తున్న ఈ విందు కార్యక్రమానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజి ప్రకటించిన మరుసటి రోజే అమిత్ షా రాష్ట్రంలో అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కొన్ని సమస్యలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.

వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన ర‌విచంద్రారెడ్డి, కారణం ఏంటంటే..