EC Notices To KTR: మ‌రో వివాదంలో మంత్రి కేటీఆర్, ప్ర‌చారం కోసం ఆ ప్లేస్ ఎలా వాడుకుంటారంటూ ఈసీ సీరియ‌స్, ఆదివారం మ‌ద్యాహ్నం 3 గంట‌ల్లోగా వివ‌రణ ఇవ్వాలంటూ ఆదేశం

కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా ఈసీ (EC Notice) నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

Minister KTR (Photo-X)

Hyderabad, NOV 25: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు  (EC Notice to KTR) కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రణదీప్‌ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా ఈసీ (EC Notice) నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ‘‘ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ‘టీ’ వర్క్స్‌ భేటీలో విద్యార్థులకు కేటీఆర్‌ (KTR) హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఆఫీసు ‘టీ’ వర్క్స్‌ను (T- works) వాడుకున్నారు’’ అని సూర్జేవాల ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... మంత్రి కేటీఆర్‌ ప్రాథమిక ఎన్నికల నియామవాళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. ఆదివారం మధ్యాహ్నం 3గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది.